టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తోంది.కాగా ఈ క్వాష్ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ చేసే అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.