అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దర్శకుడు సురేందర్ రెడ్డి ( Directed Surender Reddy )ఏజెంట్ సినిమా ను హద్దుపద్దు లేకుండా ఖర్చు చేసి బడ్జెట్ ని భారీ గా పెంచాడు.
అయినా కూడా నిర్మాత అనిల్ సుంకర ఖర్చు కి వెనకాడకుండా సినిమా ను నిర్మించాడు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అందరిని నిరాశకి గురి చేసిన విషయం తెల్సిందే.
థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యారు.కానీ కొన్ని కారణాల వల్ల ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వలేదు.
సినిమా కు అసలే డిజాస్టర్ టాక్ వచ్చింది.
పైగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయం లో చాలా ఆలస్యం అయింది.కనుక ఓటీటీ లో ఇప్పుడు ఏజెంట్( Agent ) ని ఎవరు చూస్తారు అంటూ చాలా మంది ఎద్దేవ చేస్తున్నారు.అసలు ఇప్పటి వరకు ఏజెంట్ సినిమా ఓటీటీ లో ఎందుకు రాలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు మాత్రం ఇప్పటి వరకు ఏజెంట్ ని విడుదల చేయలేదు అంటే ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మేకర్స్ ముందుగానే ఓటీటీ లో కూడా ఈ సినిమా ని ఎవరు చూడక పోవచ్చు అనుకున్నారేమో అందుకే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్( OTT streaming ) విషయం లో ఇన్నాళ్లు ఆలస్యం చేశారు అంటున్నారు.మొత్తానికి అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా తో వస్తున్నాను అంటూ ప్రకటించగానే హడావుడి ఏమీ ఉండదు.
వస్తే సరే, చూసే వారు చూస్తారు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి అఖిల్ కొత్త సినిమా ప్రారంభం కాకముందే ఏజెంట్ ని వదిలితే బాగుంటుందని అక్కినేని అభిమానులు భావించారు.
ఎట్టకేలకు వారి కోరిక మేరకు ఏజెంట్ పని పూర్తి చేస్తున్నారు.ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కి అంతా రెడీగా ఉంది.