అంగళ్లు కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు గ్రామంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ ఘర్షణపై కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబును ఏ1గా చేర్చారు.
ఈ క్రమంలో కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.