మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయ్యేవరకు ఆహారం తీలుకోనని ప్రమాణం చేశారు.చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో వుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ నుండి విడుదలయ్యేంత వరకు ఆహారం తీసుకోకుండా శాంతినగర్ లోని ntr విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు శిబిరంలో ప్రమాణం చేశారు.