టీడీపీ అధినేత చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన తరపు న్యాయవాదులు కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.