కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లిబరేషన్ పై వర్చువల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామన్నారు.నిజాం పాలనలో ప్రజల బాధలను ఈ ఎగ్జిబిషన్ లో చూపిస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా దివ్యాంగులకు రేపు ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.కాగా రేపటి వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు.