టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్(Allu Arjun) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈయన గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) ఇంత చిన్న వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన విశ్వరూపం చూపించారు .
ఇక అర్హ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఈమెకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.తన ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేస్తూ ఉన్నటువంటి వీడియోలను తరచూ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి (Sneha Reddy) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇలా అల్లు అర్హ అల్లరి చేష్టలకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇలా అల్లరితో పాటు ఈ చిన్నారిలో చాలా టాలెంట్ కూడా దాగి ఉంది అనే విషయం ఇదివరకు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.ఇకపోతే తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా అల్లు అర్హ స్కూల్లో వినాయకుడి(Vinayaka) విగ్రహాల కాంపిటీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అల్లు అర్హ చాలా ముద్దు ముద్దుగా బొజ్జ గణపయ్యను తయారు చేశారు.ఇందుకు సంబంధించినటువంటి వీడియోని అల్లు స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

ఇలా అల్లు అర్హ తన చిన్ని చిన్ని చేతులతో బొజ్జ గణపయ్యను ఎంతో ముద్దుగా తయారు చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అల్లు అర్హ టాలెంట్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.ఎంతైనా అల్లు వారసురాలు కదా టాలెంట్ బై బ్లడ్ లోనే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక అల్లు అర్హ కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా తన తల్లి స్నేహ రెడ్డి వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ విధంగా తన కుమారుడు అయాన్ కూతురు అర్హకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో స్నేహారెడ్డి షేర్ చేసుకోవడంతో ఈ చిన్నారులకు ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే స్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.దీంతో కొన్నిసార్లు ఈమె ట్రోలింగ్ కి కూడా గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఇలా తన వ్యక్తిగత విషయాలతో పాటు తన పిల్లల విషయాలను అలాగే తన భర్త సినిమాల విషయాలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అల్లు స్నేహారెడ్డికి సైతం హీరోయిన్ లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ప్రస్తుతం స్నేహ రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.