కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్త ఎట్టకేలకు నేడు బయటకి వచ్చింది.తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) మరియు జనసేన పార్టీ కలిసి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని గత ఏడాది లోనే ఒక హింట్ ఇచ్చేసారు.
కానీ ఇన్ని రోజులు దానిని అధికారికంగా ప్రకటించలేదు.అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారిపోయింది.
మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్ర బాబు నాయుడు ని ‘స్కిల్ డెవలప్మెంట్’ ( Skill Development )కేసు క్రింద ఏసీబీ అరెస్ట్ చెయ్యడం పెద్ద సంచలనం గా మారింది.నలుగురిలో ఏ ఇద్దరు మాట్లాడుకున్న దీని గురించే చర్చ.
తెలుగు దేశం పార్టీ శ్రేణులు మరియు నాయకులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు.ఇలాంటి నిరాశ సమయం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబు నాయుడు ని కలిసి ఆ తర్వాత పొత్తు ని అధికారికంగా ప్రకటించడం తో ఒక్కసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
![Telugu Nagababu, Pawan Kalyan, Telugu Desam, Ycp-Telugu Political News Telugu Nagababu, Pawan Kalyan, Telugu Desam, Ycp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Nagababus-silence-on-TDP-Jana-Sena-alliance-Is-he-going-to-leave-politicsc.jpg)
ఇరువురి పార్టీల శ్రేణులు మరియు కార్యకర్తల్లో పండుగ వాతావరణం కనిపించగా, అధికార వైసీపీ పార్టీ గుండెల్లో మాత్రం గుబులు మొదలైంది.ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ పార్టీ( YCP party ) పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.ఈ వ్యతిరేకతలో ఒక్క ఓటు కూడా చీలకుండా ఉండేందుకే టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.అయితే అభిమానులు అధిక శాతం మంచి జోష్ మీదనే ఉన్నప్పటికీ కొంత శాతం అభిమానులు మాత్రం అసంతృప్తి తోనే ఉన్నారు.
వారిలో జనసేన పార్టీ నాయకులైన కొణిదెల నాగబాబు నిరాశ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే నేడు పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చెప్పిన తర్వాత సోషల్ మీడియా అందరి నాయకుల నుండి పోస్టులు పడ్డాయి కానీ, నాగబాబు నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు.
దీంతో అభిమానుల్లో నాగబాబు కి ఈ పొత్తు ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
![Telugu Nagababu, Pawan Kalyan, Telugu Desam, Ycp-Telugu Political News Telugu Nagababu, Pawan Kalyan, Telugu Desam, Ycp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Nagababus-silence-on-TDP-Jana-Sena-alliance-Is-he-going-to-leave-politicsd.jpg)
పొత్తు ఉంటుంది అనే విషయం నేడే ఏమి ఖరారు కాలేదు.ఎప్పుడో తీసుకున్న నిర్ణయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు అంతే.అయితే నేడు పవన్ కళ్యాణ్ బాలయ్య తో కలిసి రావడమే నాగ బాబు కి ఈ విషయం పై స్పందించేందుకు మనసు చెల్లడం లేదని తెలుస్తుంది.
ఎందుకంటే గతం లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ కామెంట్ చెయ్యడం, దానికి నాగబాబు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడడం వంటివి జరిగాయి.ఆ సంఘటనల కారణం గానే నేడు ఆయన మౌనం వహించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త.
మరి రేపైనా నాగబాబు స్పందిస్తాడో లేదో చూడాలి.