యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో సరికొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!

వండర్ ప్లస్ ఈవెంట్లో యాపిల్ వాచ్ అల్ట్రా 2( Apple Watch Ultra 2 ) ను కంపెనీ లాంచ్ చేసింది.ఈ సరికొత్త వాచ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్ ప్ ను అందించనుంది.

 The Latest Features And Price Details In Apple Watch Ultra 2 , Apple Watch Ultra-TeluguStop.com

ఇక లో చార్జింగ్ మోడ్ లో అయితే 72 గంటల వరకు ఉపయోగించవచ్చు.యాపిల్ కంపెనీ( Apple Company ) లాంచ్ చేసిన వాచ్ లలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వాచ్ యాపిల్ వాచ్ అల్ట్రా 2.సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఈ వాచ్ సేల్ ప్రారంభం కానుంది.ఈ వాచ్ ధర 799 డాలర్లు గా ఉంది.మన భారత కరెన్సీలో రూ.64000.అయితే భారతదేశంలో ఈ వాచ్ ధర రూ.89900 గా నిర్ణయించారు.

ఈ వాచ్ స్పెసిఫికేషన్లో విషయానికి వస్తే.3000 నిట్స్ బ్రైట్నెస్ డిస్ప్లే( 3000 nits brightness display ) తో వస్తుంది.ఈ వాచ్ బాడీను టైటానియంతో రూపొందించారు.ఇందులో కంపెనీ కస్టమ్ ఎస్9 ఎస్ఐపీ చిప్ సెట్ ను అందించారు.ఈ వాచ్ లో ఆన్ డివైస్ సిరి ప్రాసెసింగ్, మెరుగైన లొకేషన్ ట్రాకింగ్ ఉన్నాయి.వాచ్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ వాచ్ పనిచేస్తుంది.

ఈ వాచ్ ను యూజర్లు డిస్ప్లే టచ్ చేయకుండానే ఒక చేత్తో వాచ్ ను కంట్రోల్ చేయవచ్చు.కొండలు ఎక్కేవారు హైకింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ వాచ్ లో ఆల్టిట్యూడ్ రేంజ్ ను సముద్రమట్టం కంటే 500 మీటర్ల కిందకు 9,000 మీటర్లు పైకి అందించారు.

వాటర్ స్పోర్ట్స్ ఆడే వారి కోసం 40 మీటర్ల వరకు డ్రైవింగ్ డెప్త్ కూడా ఉంది.యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో మాడ్యులర్ అల్ట్రా అనే కొత్త ఫేస్ ను అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube