టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టు కావడంతో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది.రాజకీయ కక్షతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ మంత్రి రోజా డాన్సులు వేయడంతో పాటు స్వీట్లు పంచటం తెలిసిందే.అంతేకాకుండా చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
దీంతో మంత్రి రోజా మాట తీరుపై టీడీపీ మహిళా నేత మాజీ మంత్రి పీతల సుజాత( Former Minister Peethala Sujatha ) స్పందించారు.మంత్రి రోజా సవ్యంగా మాట్లాడాలని హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాలకొల్లులో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొనడం జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.రోజా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిన నువ్వు ఈరోజు మంత్రి అయిన తర్వాత ఆస్తులు ఎలా సమకూర్చుకుంటున్నావో అన్ని బయటపెడతాం అని అన్నారు.ఇష్టానుసారంగా ఓ రెచ్చిపోయి మాట్లాడకు.
నీ సినిమాలోనే ఇత్తడి అయిపోద్ది అనే డైలాగ్ ఉంటది.రాబోయే రోజుల్లో నీ పొగరుకు కూడా అదే జరుగుతుంది అంటూ మాజీ మంత్రి పీతల సుజాత వార్నింగ్ ఇచ్చారు.