సలార్ వాయిదా విషయం లో ప్రభాస్‌ కోపంగా ఉన్నాడా?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌( Prabhas ) హీరోగా కేజీఎఫ్ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) దర్శకత్వం లో రూపొందిన సలార్‌ సినిమా ను( Salaar ) ఈ నెలలో విడుదల చేయాల్సి ఉండగా వాయిదా పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.విడుదల విషయం లో ప్రభాస్ పట్టుదలతో ఉండగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం మెల్లగా చేద్దాం అన్నట్లుగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Prabhas Unhappy Due To Salaar Movie Release Postpone Details, Prabhas, Salaar Mo-TeluguStop.com

దర్శకుడితో ప్రభాస్ విభేదించినా కూడా నిర్మాతలు దర్శకుడి వైపు ఉండటంతో సినిమా విడుదల విషయం లో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రభాస్ కి ఈ ఏడాది ఆదిపురుష్ సినిమా తో నిరాశ పరిచాను కనుక ఇదే ఏడాది లో సలార్‌ సినిమా తో వస్తే బాగుంటుందని ఆయన భావించాడట.

Telugu Maruthi, Prabhas, Prabhas Angry, Prabhas Salaar, Prasanth Neel, Project,

కానీ సలార్ సినిమా విడుదల విషయం లో ఆయన నిర్ణయం ను పట్టించుకోవడం లేదు అంటున్నారు.ఈ ఏడాది లో సినిమా విడుదల ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు అన్నట్లుగా కన్నడ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ కోరుకున్నంత బిజినెస్ అవ్వడం లేదట.అందుకే బిజినెస్( Salaar Business ) భారీ గా జరిగితేనే సినిమా ను విడుదల చేసేందుకు రెడీ అవ్వబోతున్నట్లుగా ఆయన సన్నిహితుల వద్ద చెప్పారట.

దాంతో ప్రభాస్ సలార్‌ సినిమా వచ్చే ఏడాది వరకు వాయిదాల మీద వాయిదాలు పడాల్సిందే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Maruthi, Prabhas, Prabhas Angry, Prabhas Salaar, Prasanth Neel, Project,

వచ్చే ఏడాది లో ప్రాజెక్ట్‌ కే( Project K ) సినిమాతో పాటు మారుతి దర్శకత్వం లో చేస్తున్న సినిమా ను విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు.కానీ పరిస్థితి చూస్తూ ఉంటే సలార్‌ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.కనుక వెంటనే సలార్ ను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్‌ రెండవ భాగం కూడా రావాల్సి ఉంది.కనుక ఇవన్నీ ఎప్పుడు వస్తాయా అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube