ఎవరైనా సినిమా థియేటర్ కి ఎందుకు వెళ్తారు చెప్పండి మూడు గంటల పాటు హాయిగా నవ్వుకోవడానికి.కానీ ఆ పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడైతే లేవు.
సినిమా థియేటర్ కి వెళ్లి మూడు గంటల పాటు నవ్వడం మాత్రమే కాదు హర్రర్ మూవీస్( Horror Movies ) చూసి భయపడి కూడా రావాలనుకుంటున్నారు.ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, సస్పెన్స్ తో కొత్తదనం కోరుకుంటున్నారు.
ఇలా రకరకాల జోనర్ సినిమాలు థియేటర్లో సందడి చేయడానికి ప్రేక్షకుల అభిరుచులే కారణం.అయితే హర్రర్ సినిమాలు తీయడం ఇప్పుడు బాగా ఫ్యాషన్ గా మారింది కానీ ఒక జనరేషన్ వెనక్కి వెళితే అక్కినేని, ఎన్టీఆర్ వంటి హీరోలు హర్రర్ సినిమాల విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు.
థియేటర్ కి వచ్చి మూడు గంటల పాటు సినిమా చూసి భయపడి ఇంటికి వెళ్లడం ఏంటి నాన్సెన్స్ అన్నట్టుగా అక్కినేని( Akkineni Nageswara Rao ) ఒకసారి నేరుగా నిర్మాతలు ప్రశ్నించారట.సినిమా చూసి వారు ఎలాంటి సందేశాన్ని ఇంటికి తీసుకువెళ్తారు, ఈ సినిమాలతో జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ అక్కినని చెప్పేవారట.ప్రేక్షకుడు చాలా సమయాన్ని డబ్బును కూడా వెచ్చించి సినిమాకు వస్తాడు అలాంటి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసి మాత్రమే పంపించాలని అక్కినేని వాదన.
ఇక ఎన్టీఆర్( Nandamuri Taraka Ramarao ) సైతం ఇలాంటి భావనతోనే ఉండేవారు.ఆయన తన జీవితంలో హర్రర్ సినిమాలో తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు.కానీ నాటి నుంచి నేటి వరకు ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చాయి ప్రేక్షకులను అలరించాయి కూడా.
కానీ అక్కినేని, ఎన్టీఆర్ మాత్రం అలాంటి సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.వీరిద్దరూ బిజీగా వేరే సినిమాలు తీస్తున్న సమయంలో కృష్ణ( Hero Krishna ) లాంటి హీరో హర్రర్ సినిమాలు తీయడానికి ముందుకు వచ్చేవారు.
ఆకోవలోనే అవేకళ్ళు( Avekallu Movie ) అనే ఒక సినిమా తీసి విజయాన్ని దక్కించుకున్నారు.ఇక పూర్తిస్థాయి హర్రర్ సినిమా అంటే రాజేంద్ర ప్రసాద్ నటించిన కాష్మోరా సినిమా అని చెప్పి తీరాల్సిందే.