అమెరికాలో భూమిపై భారీ పగుళ్లు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సైంటిస్ట్స్...

మానవులు చేస్తున్న కొన్ని పనుల వల్ల భూ గ్రహం అనేక వాతావరణ మార్పులకు లోనవుతోంది.ఫలితంగా అతివృష్టి సంభవించడం, ఎన్నడూ లేనంతగా వడగాలులు వీచడం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి.

 Giant Cracks Open Up Across The Us Scientists Warn Its A Crisis Details, Groundw-TeluguStop.com

దీనివల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు.మరికొందరు నష్టాలను ఎదుర్కొంటున్నారు.

తాజాగా అమెరికాలో( America ) గ్రౌండ్ వాటర్ అతిగా వాడటం వల్ల ఒక ఆందోళనకర సమస్య వెలుగు చూసింది.దీనిని గమనించిన సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.వివరాల్లోకి వెళితే, నైరుతి యునైటెడ్ స్టేట్స్‌లో ప్రజలు ఎక్కువ నీటిని వాడుతున్నందున నేల పగుళ్లు( Earth Fissures ) చాలా చోట్ల ఏర్పడ్డాయి.

ప్రజలు ఎంత నీటిని వినియోగించుకోవాలనే దానిపై తగిన నియంత్రణ లేకపోవడంతో ఇలా జరుగుతోంది.ఈ పగుళ్లు గృహాలు, రోడ్లు, కాలువలను దెబ్బతీస్తాయి.

వాటి వల్ల ఆస్తి నష్టం సంభవించడంతోపాటు పశువుల పెంపకానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Telugu America, Aquifers, Change, Colorado River, Earth, Groundwater, Nri, South

గ్రౌండ్ వాటర్ ( Groundwater ) నిల్వలు తగ్గిపోతే తాగునీరు, నీటిపారుదల, పారిశ్రామిక అవసరాలకు నీటిని కనుగొనడం కష్టతరం అవుతుంది.భూమి కూడా కుచించుకుపోతుంది.ఇది రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుంది.

తీర ప్రాంతాలలో, ఉప్పునీరు( Salt Water ) చొరబడడం వల్ల మంచినీటి జలాశయాలు కలుషితమవుతాయి.వాతావరణ మార్పుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సమస్య మరింత తీవ్రమవుతోంది.

ఇక భూమి వేడెక్కుతున్న కొద్దీ, వర్షపాతం నమూనాలు మరింత అనూహ్యంగా మారుతున్నాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.

కరువు వల్ల రైతులు సాగునీటి కోసం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

Telugu America, Aquifers, Change, Colorado River, Earth, Groundwater, Nri, South

వరదలు బావులు, ఇతర నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తాయి.ఇకపోతే వాతావరణ మార్పుల వల్ల నదులు కుచించుకుపోతున్నాయి.దీనివల్ల రైతులు భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకుంటున్నారు.

యూఎస్‌లోని నైరుతి ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు అయిన కొలరాడో నది( Colorado River ) 2000 సంవత్సరం నుంచి దాదాపు 20% తగ్గిపోయింది.ఇది ఆందోళనలను రేకెత్తిస్తోంది.

తక్కువ నీటిని ఉపయోగించడం ప్రారంభించకపోతే, పగుళ్లు పెరుగుతూనే ఉంటాయి.నీటిని మరింత తెలివిగా ఉపయోగించడం ప్రారంభించాలి.

ఇళ్లలో, వ్యాపారాలలో నీటిని సంరక్షించడం ద్వారా, పొలాల్లో తక్కువ నీటిని ఉపయోగించడం ద్వారా దీన్ని చేయవచ్చు.భూగర్భ జలాల పంపింగ్‌ను నియంత్రించే విధానాలకు కూడా మద్దతు ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube