ఈ 5 స్కీమ్‌లు వృద్ధాప్యంలో మిమ్మల్ని తప్పక ఆదుకుంటాయి.. ట్రై చేయండి!

నేటి దైనందిత జీవితంలో 60 ఏళ్ల తర్వాత దాదాపుగా పని చేయడం ఒకింత సాధ్యపడే పనిగాదు కాబట్టి రెగ్యూలర్‌ ఇన్‌కమ్‌ అనేది ఉండదు.దీంతో రోజువారీ ఖర్చులు అనేవి పెనుభారంగా మారుతాయి.

 These 5 Schemes Must Supports You In Old Age Details, Senior Citizens, Senior Ci-TeluguStop.com

అందుకే ఉద్యోగ సమయంలోనే రిటైర్మెంట్‌ ప్లాన్( Retirement Plan ) చేసుకోవడం అనేది చాలా ఉత్తమం.దీనివల్ల వృద్ధాప్యంలో( Old Age ) హాయిగా బతకవచ్చు.

లేదంటే ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుంది.ఈ క్రమంలో చాలా చులకన అయిపోతాము.

అయితే మీరు ఇపుడు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఎందుకంటే మార్కెట్లో వివిధ రకాల పెన్షన్ పథకాలు( Pension Schemes ) అమలులో ఉన్నాయి.

వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల వృద్ధాప్యంలో అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు.

అలాంటి కొన్ని స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఈ లిస్టులో మొదటిది “సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్.”( Senior Citizen Saving Scheme ) ఈ స్కీమ్‌ 60 ఏళ్లు పైబడిన వారి కోసం స్టార్ట్ చేయడం జరిగింది.

ఇది ఒక రకమైన పొదుపు పథకం.ఇందులో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు మంచి రాబడి లభిస్తుంది.

మీరు కావాలంటే ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.ఆ తరువాత “పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం” గురించి మాట్లాడుకోవాలి.

Telugu Mutual Funds, Schemes, Pomis, Rbi Bonds, Seniorcitizen, Senior Citizens,

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాన్ని POMIS అని కూడా పిలుస్తారు.ఇది చిన్న పొదుపు పథకం.ఇందులో ఐదేళ్ల పాటు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

ఆ తరువాత “బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్”( Bank Fixed Deposit ) గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.దీనిని బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్‌ని అని కూడా అంటారు.

వృద్ధులు ఎఫ్‌డీ రూపంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది.ఎందుకంటే చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 0.50 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తాయి.

Telugu Mutual Funds, Schemes, Pomis, Rbi Bonds, Seniorcitizen, Senior Citizens,

ఇక ఇక్కడ “మ్యూచువల్ ఫండ్”( Mutual Fund ) గురించి కూడా చర్చించుకోవాలి.సీనియర్ సిటిజన్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కొంత కాలం తర్వాత మంచి రాబడిని పొందుతారు.అయితే పొదుపులో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పొందవచ్చు.

చివరగా “ఆర్‌బిఐ సేవింగ్స్ బాండ్‌లు”( RBI Savings Bonds ) గురించి మాట్లాడుకోవాలి.ఆర్‌బిఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్‌లపై వడ్డీ రేటు ఎన్‌ఎస్‌సిపై వడ్డీ రేటు కంటే 0.35% ఎక్కువగా ఉంటుది.ఈ బాండ్లలో కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube