శ్రీ లీల….పెళ్లి సందడి సినిమా( PelliSandaD )తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ సినిమా పరాజయం పాలైనా కూడా స్త్రీలకు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ధమాకాలో ఆమెలోని గ్రేస్ చూసిన వారంతా కూడా టాలీవుడ్ కి ఒక గొప్ప నటి వచ్చిందని అనుకున్నారు అయితే ఆమెకు ఇదే శాపంగా మారడు ఉందా అంటే అవునని అంటున్న ఈ సోషల్ మీడియా వర్గాలు.
శ్రీ లీల( Srileela )చాలా చక్కగా నటించగలరు అంతకన్నా చక్కగా డాన్స్ చేయగలదు.ఈ రెండు విషయాలే ఆమెను టాప్ హీరోయిన్ కి దూసుకెళ్లేలా చేశాయి.
నటించిన రెండు సినిమాల్లో ఒకటి హిట్ అయితే మరొకటి ప్లాప్ కానీ ఆమెకి ఇంత డిమాండ్ ఎందుకు అంటే ఆమెను సరిగ్గా వాడుకుంటే మరో మహానటి కాగలదు అని ఆమెను చూసినవారు ఎవరైనా సరే చెప్పగలరు.
ప్రస్తుతం అఫీషియల్ గా ఆమె 8 సినిమాల్లో నటిస్తున్న అనధికారికంగా మరో మూడు సినిమాలు కూడా సంతకం చేసినట్టుగా తెలుస్తోంది.మొన్న బోయపాటి ( Boyapati Srinu )మాట్లాడుతూ కూడా నువ్వు నటించని హీరోల లిస్టు చూడాల్సిందే తప్ప నువ్వు ఎవరి సినిమాలో నటిస్తున్నావు అని అడగకూడదు అంటూ ఆమెను సెటైర్ వేశాడు అంతేకాదు కాస్త తక్కువగా పరిగెత్తు వచ్చినదల్లా చేయకు అంటూ స్టేజిపై ఆమెను కామెంట్ చేశాడు.అయితే ఆమె ఇన్ని సినిమాల్లో నటిస్తున్న కారణం చేత అందరి దృష్టి నటులు ఎప్పుడూ కుళ్లుకుంటూనే ఉన్నారు.
నిన్నగాక మొన్న వచ్చింది ఇన్ని సినిమాలు ఎగరేసుకుపోయింది అనుకుంటుంటే, చివరికి దర్శకుడు సైతం ఆమెపై కామెంట్స్ చేయడమే ప్రస్తుతం సంచలనగా మారింది.
తెలుగు సినిమా దర్శకులకు ఆమె వీలైనంత టైం ఇస్తూనే ఉన్నప్పటికీ ఇవ్వనివారు ఆమెపై సెటైర్స్ వేస్తున్నారట.చూడ్డానికి ఇంత ఉంది ఈమెకు ఎన్ని సినిమాలు ఏంటి అని అనేవారు కొంతమంది అయితే ఇంత పెద్ద స్టార్ సినిమాలో అవకాశం ఇస్తే చేయడం లేదంటూ అనుకునేవారు మరికొంతమంది.ఇప్పటికే ఆమె మరో మూడేళ్ల పాటు ఖాళీ లేకుండా బుక్ అయిపోయింది.
దాంతో కొత్త సినిమాలు ఒప్పుకోవడానికి సమయం లేకుండా ఉంది.అలా అంటే దర్శకుల దృష్టిలో నిర్మాతలు ఆమె చెడు అవుతుంది.
ఇక ఆమె నటించే సినిమాలు కనుక ఫ్లాప్ అయితే ఆమెను ఐరన్ లెగ్ గా ముద్రించడానికి సైతం మన తెలుగు ఇండస్ట్రీ వెనకాడదు.