టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ స్పందించారు.తెనాలిలో మాట్లాడిన ఆయన వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్న నాదెండ్ల విపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు.దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పేర్కొన్నారు.
గతంలో తమ పార్టీ అధినేత పవన్ ను సైతం పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారన్న నాదెండ్ల సీఎం జగన్ రాష్ట్రాన్ని నెగెటివ్ గ్రోత్ లోకి నెట్టేశారని విమర్శించారు.మూడేళ్ల కిందటి ఎఫ్ఐఆర్ ను తీసుకువచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే పోలీసులు ప్రొసీజర్ కు వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదని నాదెండ్ల సూచించారు.