చట్టం ఎవరికీ చుట్టం కాదని మంత్రి విడదల రజనీ అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన ఆమె చంద్రబాబు అయినా ఇంకెవరు అయినా చట్టానికి ఒక్కటేనని తెలిపారు.
అవినీతి చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇది తొలి అరెస్ట్ కాదన్నారు.
ఈ కుంభకోణంలో అనేక మంది పాత్ర ఉందని చెప్పారు.కేబినెట్ నిర్ణయానికి అగ్రిమెంట్ కు పొంతన లేదన్నారు.
ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని ఆమె ఆరోపించారు.అవినీతికి పాల్పడ్డారు కాబట్టి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
కాగా చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.