టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ( Vijay deverakonda ) తాజాగా ఖుషి సినిమా( Kushi Movie )తో ప్రేక్షకులను పలకరించిన తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఇక గత సినిమా లైగర్ ఘోరమైన డిజాస్టర్ ను చవిచూడడంతో పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం విజయ్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే విజయ్ ఇటీవల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దాదాపు ఒక 100 మందికి ఒక్కొక్క ఫ్యామిలీకి లక్ష రూపాయలు చొప్పున కోటి రూపాయలు ఇస్తాను అని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే విజయ్ దేవరకొండ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆయన అంతకు ముందు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత అభిషేక్ నామా( Abhishek Nama ) ట్విట్టర్ వేదిక చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిర్మాతని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.దమ్ముంటే స్టార్ హీరోలను కూడా ఇలా అడగాలి అంటూ కౌంటర్స్ సంధించారు.
విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు భయపడిన నిర్మాత నుండి తర్వాత ఎటువంటి రిప్లయ్ రాలేదు.ఇప్పుడా నిర్మాతకు విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు( Govardhan Rao ) కూడా కౌంటర్ వదిలారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తండ్రి గోవర్ధనరావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఆ సినిమా ఫ్లాపులో విజయ్‌కి సంబంధం లేకపోయినప్పటికీ, నా కొడుకు పేరు పాడు చేయడానికి అభిషేక్ నామా ప్రయత్నిస్తున్నాడు.
అతని బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఇక్కడ పనిచేయవు.
ఆ సినిమాకు పూర్తి రెమ్యూనరేషన్ కూడా విజయ్‌కి ఇవ్వలేదు.ఆ విషయం నిర్మాత కెఎస్ రామారావు( KS Rama rao )కి తెలుసు.ఆ సినిమా తర్వాత తన బ్యానర్‌లో సినిమా చేయాలని అభిషేక్ నామా కలిశారు.
కానీ అప్పటికే అంగీకరించిన సినిమాలు ఉన్నాయని,ఇప్పుడు కుదరదని చెప్పాడు విజయ్.అది మనసులో పెట్టుకుని ఇప్పుడిలా చేస్తున్నాడు.
భవిష్యత్‌లో అతనితో విజయ్ సినిమా చేయడు.ఖుషి సినిమా గురించి మాట్లాడే రైట్స్ అభిషేక్‌కి లేవు.
విజయ్ మార్కెట్ పడిపోయిందని అంటూనే అతనితో సినిమా చేయాలని ప్రయత్నించడం చూస్తుంటే అభిషేక్ నామాది రెండు నాలుకల ధోరణి అనేది అర్థమవుతుంది.కావాలని ఎంత టార్గెట్ చేసినా.
విజయ్‌కి అభిమానుల బలం ఉందిఅంతా వాళ్లే చూసుకుంటారంటూ విజయ్ తండ్రి గోవర్ధన్ రావు అభిషేక్ కీ దిమ్మ తిరిగి రేంజ్ లో సమాధానం ఇచ్చారు.