కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.ర్యాలీలు, ఆందోళనలతో పాటు ఖలిస్తాన్ రెఫరెండంలు( Khalistan Referendum ) నిర్వహిస్తున్నారు.
ఏకంగా భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు.ఇక హిందూ ఆలయాల( Hindu Temples ) విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
తాజాగా బ్రిటీష్ కొలంబియాలోని( British Columbia ) ఓ హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల రాతలు రాశారు దుండగులు.సర్రేలోని శ్రీమాతా భామేశ్వరి దుర్గా సొసైటీ మందిర్( Shree Mata Bhameshwari Durga Society Mandir ) వెలుపలి గోడలపై గురువారం ‘‘పంజాబ్ భారత్ కాదు’’ అనే నినాదాలు రాశారు.
ఘటనపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగంలోని సర్రే అధికారులు దర్యాప్తు చేపట్టారు.సెప్టెంబర్ 10న జరగనున్న ఖలిస్తాన్ రెఫరెండంకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
మరోవైపు.వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను లాక్డౌన్ చేస్తామని నిషేధిత సిక్కు గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
అయితే ఈ రెఫరెండానికి సంబంధించిన పోస్టర్‌పై ఆయుధాలు, ఉగ్రవాదుల ఫోటోలు వుండటంతో పాఠశాల యాజమాన్యం రెఫరెండాన్ని రద్దు చేసింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో( Surrey ) వున్న ‘‘తమనావిస్ సెకండరీ స్కూల్లో’’( Tamanawis Secondary School ) ఖలిస్తాన్ రెఫరెండం జరగాల్సి వుంది.
ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ అతికించిన పోస్టర్లపై ఆయుధాలు, తుపాకులు వున్నట్లు స్థానికులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన యాజమాన్యం .ఆ పోస్టర్లను తొలగించాల్సిందిగా పలుమార్లు రెఫరెండం నిర్వాహకులను కోరింది.అయినా అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెఫరెండంను రద్దు చేస్తున్నట్లు సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్ ఆదివారం ప్రకటించింది.
అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఈవెంట్‌కు సంబంధించిన ప్రచార సామాగ్రిపై పాఠశాల చిత్రాలు, ఆయుధాల బొమ్మలు వున్నాయని సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్‌ను ఉటంకిస్తూ ది ఇండో కెనడియన్ వాయిస్ వెబ్సైట్ పేర్కొంది.సమస్యను పరిష్కరించేందుకు పదే పదే ప్రయత్నించినప్పటికీ.ఈవెంట్ నిర్వాహకులు ఈ చిత్రాలను తీసివేయడంలో విఫలమయ్యారని స్కూల్ యాజమాన్యం తెలిపింది.దీనికి తోడు సర్రే అంతటా, సోషల్ మీడియాలోనూ మెటీరియల్‌ను పోస్ట్ చేశారని పేర్కొంది.
సదరు పోస్టర్లో నిషేధిత ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’( Sikhs For Justice ) (ఎస్ఎఫ్జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ</em పేరుతో కిర్పాన్ (కత్తి), ఏకే 47 తుపాకులు వున్నాయి.వీటితో పాటుగా ఈ ఏడాది జూన్‌లో పార్కింగ్ ప్లేస్‌లో హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్, 1985 ఎయిరిండియా ఫ్లైట్ బాంబు దాడి సూత్రధారి తల్విందర్ సింగ్ పర్మార్ల చిత్రాలు కూడా పొందుపరిచారు.