నంద్యాల జిల్లా డోన్ లో పట్టపగలే కత్తులు, వేట కొడవళ్ళతో దాడి..!

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం( Dhone )లో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.కొందరు వ్యక్తులు పట్టపగలే కత్తులు, మారణయాధాలతో డోన్ నగరంలో రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నారు.

 Attack With Knives And Hunting Knives In Doan Of Nandyala District , Nandyala Di-TeluguStop.com

మంగళవారం ఓ ఆటో డ్రైవర్ డోన్ నియోజకవర్గంలో కత్తులు, వేట కొడవళ్ళతో దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Andhra Pradesh, Dhone, Latest Telugu, Nandyala-Latest News - Telugu

వివరాల్లోకెళితే.డోన్ నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తిని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్ళు, ఇతర మారణయుధాలతో దాడి చేశారు.పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా నరికారు.

కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరించడంతో నిస్సహాయంగా చూస్తూనే ఉండిపోయారు.కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిని దారుణంగా నరికి అక్కడి నుంచి ఆ వ్యక్తులు పరారయ్యారు.

పోలీసులకు( Police ) సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.బాధితుడు డోన్ మండలం చండ్రపల్లికి చెందిన సుంకన్న( Sunkanna ) గా గుర్తించారు.

సుంకన్న ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు.డోన్ లో ఎద్దుల సంత దగ్గర ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు సుంకన్న పై దాడి చేసి చేశారు.

క్షణాల వ్యవధిలోని ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది.పోలీసులు కొన ఊపిరితో ఉన్న సుంకన్నను ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Telugu Andhra Pradesh, Dhone, Latest Telugu, Nandyala-Latest News - Telugu

గత ఫిబ్రవరిలో డోన్ నియోజకవర్గంలో ఓ దారుణ హత్య జరిగింది.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.ఇక గత డిసెంబర్ లో కూడా ఆటోలో వెళుతున్న మహిళా జడ్జిపై కూడా కొందరు దుండగులు అడ్డుకొని వీరంగం సృష్టించారు.

డోన్ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న దారుణాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube