నందమూరి బాలకృష్ణ,( Balakrishna ) జూనియర్ ఎన్టీఆర్ లు( Jr NTR ) తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే బాలయ్యకు, అబ్బాయి తారక్ కు పడదని ఎప్పటి నుండో టాక్ ఉంది.
వీరి మధ్య మాటలు లేవని అందుకే ఎన్టీఆర్ బాలయ్య మాట్లాడుకోరని వార్తలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే తాజాగా నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేసే సంఘటన జరిగింది.
ఇటీవలే నందమూరి ఇంట పెళ్లి బాజాలు మోగాయి.ఈ పెళ్లితో నందమూరి కుటుంబం మొత్తం ఒక దగ్గరికి వచ్చింది.నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని( Suhasini ) తన కొడుకు పెళ్లిని ఇటీవలే ఘనంగా జరిగింది.అక్క కొడుకు మేనల్లుడి పెళ్ళికి కళ్యాణ్ రామ్,( Kalyan Ram ) ఎన్టీఆర్ తో పాటు బాలయ్య ఆయన ఫ్యామిలీ మొత్తం నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) మొత్తం ఈ పెళ్ళిలో సందడి చేసారు.

ఇక ఆ రోజు పెళ్లి నుండి కొన్ని పిక్స్ బయటకు రాగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో( Mokshagna ) ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దిగిన పిక్ వైరల్ అయ్యింది.అది చూసి సంతోష పడిన ఫ్యాన్స్ ఆ పిక్ ను వైరల్ చేసారు.ఇక ఇప్పుడు అంతకంటే గూస్ బంప్స్ తెచ్చిన పిక్ వైరల్ అయ్యింది.ఎన్టీఆర్, మోక్షజ్ఞను ఆత్మీయంగా కౌగిలించుకున్న పిక్ వైరల్ అయ్యింది.పిక్ ఆఫ్ డే గా ఈ ఫోటో నిలిచింది.

ఈ పిక్ చూసిన నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ) చేస్తుండగా బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది.
ఇక మోక్షజ్ఞ కూడా అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడు అని టాక్ ఎప్పటి నుండో వినిపిస్తుంది.