తెలంగాణభవన్ వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు.
ఎన్నికలు ఇతర పార్టీలకు పొలిటికల్ గేమన్న కేసీఆర్ ఎన్నికలను తాము పవిత్ర యజ్ఞంలా భావిస్తామని చెప్పారు.ఎంఐఎం తమకు మిత్రపక్షమేనన్నారు.
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో అనివార్యమైన చోటే మార్పులు చేశామన్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని పేర్కొన్నారు.నేతల విజ్ఞప్తి మేరకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపిన కేసీఆర్ అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.