కొనిదెల శివ శంకర వర ప్రసాద్.అలాయాస్ మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.పునాదిరాళ్లు సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ నటుడు అద్భుత సినిమాలతో తక్కువ కాలంలోనే ఎంతో పేరు సంపాదించాడు.
వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్లాడు.తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు హవా కొనసాగుతున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి.
తిరగులు లేని నటుడిగా మారిపోయాడు.
చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాటు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.
తనకు తానే పోటీ అనే స్థాయిలో సినిమాలు చేశాడు.ఒకదానిని మించి మరొక హిట్ తో ముందుకు సాగాడు.మెగాస్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలా కలెక్షన్ల వర్షం కురిసేది.బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేవి.
చిరంజీవి తన నాలుగున్న దశాబ్దాల సినిమా కెరీర్ లో ఎన్నో కనీవినీ ఎరుగని రికార్డులు సాధించాడు.ఇంతకీ ఆయన సినిమాలు సాధించిన అత్యధిక వసూళ్లు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తాజా హిట్ మూవీ సైరా నర్సింహారెడ్డి.ఈ సినిమా రూ.132 కోట్లు సంపాదించింది.ఖైదీ నెంబర్ 150 సైతం వంద కోట్ల క్లబ్ లో చేరింది.
ఈ సినిమా 104 కోట్లు వసూలు చేసింది.ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.27 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.శంకర్ దాదా ఎంబిబిఎస్ సైతం మంచి విజయం సాధించింది.26 కోట్ల రూపాయలు సాధించింది.

ఠాగూర్ సినిమా సైతం మంచి హిట్ అందుకుంది.24 కోట్ల రూపాయలు వసూలు చేసింది.స్టాలిన్ సినిమా 23 కోట్లు సాధించగా.
శంకర్ దాదా జిందాబాద్ సినిమా ప్లాప్ అయినా 18 కోట్లు వసూలు చేసింది.అన్నయ్య సినిమా 13 కోట్లు, జై చిరంజీవ సినిమా ప్లాప్ అయినా 12 కోట్లు కలెక్ట్ చేసింది.
ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లోనే 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.