విరాట్ కోహ్లీ కెరీర్ లో అత్యంత ప్రత్యేకమైన 15 విజయాలు ఇవే..!

విరాట్ కోహ్లీ( Virat Kohli ) గత 15 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించాడు.2008 ఆగస్టు 18 న విరాట్ కోహ్లీ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.విరాట్ కోహ్లీ తన కెరీర్లో సాధించిన అత్యంత ప్రత్యేకమైన విజయాలు ఏమిటో చూద్దాం.2008లో వన్డే ఫార్మాట్లోకి( ODI Cricket ) ఆరంగేట్రం చేసిన కోహ్లీ ఈ ఫార్మాట్లో 275 మ్యాచ్లలో 12898 పరుగులు చేశాడు.ఇందులో 46 సెంచరీలు 65 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.2010లో టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చి 115 టీ20 మ్యాచ్ లలో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీ లతో సహా మొత్తం 4008 పరుగులు చేశాడు.2011లో టెస్ట్ ఫార్మాట్లోకి( Test Cricket ) ఎంట్రీ ఇచ్చి 111 మ్యాచ్లలో 29 సెంచరీలు, 29 అర్థ సెంచరీలతో 8676 పరుగులు చేశాడు.2008లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి అండర్ 19 ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది.

 15 Glorious Years Of Virat Kohli Cricket Career Details, Virat Kohli, Virat Koh-TeluguStop.com
Telugu Cup, Trophy, Cricketervirat, Kohli, Virat Kohli, Viratkohli-Sports News

ఈ టైటిల్ గెలవడానికి కోహ్లీ కీలక పాత్ర వహించాడు.2011లో ధోని సారథ్యంలో భారత జట్టు ప్రపంచ కప్( World Cup ) గెలిచింది.భారత్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర వహించాడు.2013లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ( Champions Trophy ) గెలిచింది.47 పరుగులు చేసి భారత్ ఛాంపియన్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర వహించాడు.2013 లో విరాట్ కోహ్లీ తొలిసారి వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా అవతరించాడు.2018లో టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు.అనంతరం మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిచిన ఏకైక భారత క్రికెటర్ గా నిలిచాడు.2014లో ధోని( MS Dhoni ) టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ.

Telugu Cup, Trophy, Cricketervirat, Kohli, Virat Kohli, Viratkohli-Sports News

టేస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా తొలి మూడు ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధికంగా 4008 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు.వన్డేలలో అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు.213 మ్యాచ్లలో ఈ ఘనత సాధించాడు.2018లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డు( Khel Ratna Award ) అందుకున్నాడు.2018-19 లో కోహ్లీ సారథ్యంలో భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి భారతీయుడు, తొలి ఆసియా కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube