ఇండియా కూటమిలో ఆప్ చిచ్చు..సఖ్యత మిస్సయిందా..?

దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి.ఇప్పటికే బలమైన శక్తిగా ఉన్నటువంటి బిజెపిని ఎలాగైనా పడగొట్టాలని అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కలిపి, ఇండియా( INDIA ) కూటమిగా ఏర్పడ్డాయి.

 Aap's Split In India's Alliance..has Unity Been Lost..? , Aap , Congress Party ,-TeluguStop.com

ఈ ప్రతిపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు.ఎలాగైనా రాబోవు లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని( BJP ) పడగొట్టాలని వీళ్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా ఈ కూటమిలో కాస్త ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని అర్థమవుతుంది.దానికి ప్రధాన కారణం ఢిల్లీలో ఏర్పడిన రాజకీయ పరిణామాలు అని చెప్పవచ్చు.

మరి ఆ పూర్తి వివరాలు చూద్దాం.

ఈ కూటమిలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తగ్గి, ఇతర పార్టీలకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఇది తీసుకున్న కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్( CONGRESS ) మరియు ఆప్ మధ్య కాస్త చిచ్చు మొదలైంది.ఢిల్లీ పరిధిలో ఉండే ఏడు లోక్ సభ సీట్లలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు పకడ్బందీగా చేసుకుంటున్నట్లు అధికార ప్రతినిధి ఆల్కలాంబ అన్నారు.

దీంతో ఆప్( AAP) పార్టీలో మంట పుట్టింది.ఓవైపు ఇండియా కూటమి పేరుతో బేటి నిర్వహిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ఆప్ పార్టీ తప్పు పట్టింది.

ఒకవేళ కాంగ్రెస్ ఇదే వైఖరి అనుసరిస్తే త్వరలో మహారాష్ట్ర( Maharashtra ) జరిగే ఇండియా కూటమి మూడవ బేటిని బైక్ కట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది.

Telugu @rahulgandhi, Alkalamba, Arvind Kejriwal, Congress, India, Maharashtra, N

వెంటనే స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఆల్కలాంబాకు(ALKA LAMBA) అలాంటి వ్యాఖ్యలు చేసే అవసరం లేదని, కాంగ్రెస్ అగ్ర నేతలు అయినటువంటి మల్లికార్జున కార్గే(MALLIKARJUNA KARG E) రాహుల్ గాంధీ( RAHUL GANDHI ) భేటీ దీనిపై చర్చిస్తామని స్పష్టం చేశారు.ఇప్పుడిప్పుడే ఇండియా కూటమి ద్వారా ఎలాగైనా దేశంలో బిజెపిని గద్దె దించాలని చూస్తున్నటువంటి తరుణంలో లాంబా వ్యాఖ్యలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆలోచించేలా చేశాయి.

Telugu @rahulgandhi, Alkalamba, Arvind Kejriwal, Congress, India, Maharashtra, N

మొదట్లోనే కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తే చివరి వరకు ఎలా ఉంటుందో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.మరి చూడాలి చివరి వరకు ఇండియా( INDIA ) కూటమి పార్టీల సఖ్యత ఉంటుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube