ఎఫ్‌టీఏపై ఇండియా- యూకే మధ్య 12వ రౌండ్ చర్చలు.. పాజిటివ్ ట్రెండే వుంది : బ్రిటన్‌లో భారత హైకమీషనర్

బుధవారం నుంచి న్యూఢిల్లీలో ప్రారంభంకానున్న ఇండియా-యూకే( India-UK ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) 12వ రౌండ్ చర్చలపై యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి( Vikram Doraiswamy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకే సారుప్యం వున్న రెండు ఆర్ధిక వ్యవస్థలు ఒప్పందానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఆసక్తిగా వున్నాయన్నారు.

 Trend Line On India-uk Fta Very Positive, Says Indian High Commissioner To Uk Vi-TeluguStop.com

భారత్, యూకేల మధ్య విస్తృత ద్వైపాక్షిక భాగస్వామ్యంపై దొరైస్వామి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.ఎఫ్‌టీఏ గురించి తాను సానుకూలంగా వున్నానని ఆయన పేర్కొన్నారు.

Telugu Britain, European, India Uk, Indianuk, Trendline-Telugu NRI

గతేడాది జనవరిలో ప్రారంభమైన ఎఫ్‌టీఏ( FTA ) చర్చలలో చాలా సన్నిహితంగా పాల్గొన్న దొరైస్వామి.భారత ఆర్ధిక వ్యవస్థలోని కొన్ని సంక్షిష్టతలను యూకే గుర్తించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.యూరోపియన్ యూనియన్‌లో( European Union ) భాగంగా వున్నప్పుడు బ్రిటన్( Britain ) పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపలేదనే వాస్తవాన్ని కూడా భారత్ పరిగణనలోనికి తీసుకోవాలని హైకమీషనర్ పేర్కొన్నారు.అందువల్ల ఇరువైపులా సర్దుబాటు చేయాల్సిన అంశాలు అనేకం వున్నాయన్నారు.

కానీ ఓవరాల్‌గా ఈ ఒప్పందంపై పాజిటివ్ ట్రెండే కనిపిస్తోందని దొరైస్వామి చెప్పారు.

Telugu Britain, European, India Uk, Indianuk, Trendline-Telugu NRI

కాగా.ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 11వ రౌండ్ చర్చలు బ్రిటన్‌ వేదికగా జూలై 18న ముగిశాయి.ఇది తొమ్మిది విధాన రంగాల్లోని వివరణాత్మక ముసాయిదా టెక్ట్స్‌ను కవర్ చేసినట్లు ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

యూకే ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం 2022లో 36 బిలియన్ పౌండ్లకు చేరుకుంది.

ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకే ఎఫ్‌టీఏను ఇరుదేశాలు ముందుకు తెచ్చాయి.లండన్‌లో జరిగిన 11వ రౌండ్ చర్చలు చాలా బాగా జరిగాయని, పలు సమస్యలకు పరిష్కారం లభించిందని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు.

ప్రతిపాదిత ఎఫ్‌టీఏలోని మొత్తం 26 ఛాప్టర్‌లలో 19 క్లోజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube