లండన్‌లోని భారత హైకమిషన్( Indian High Commission ) మంగళవారం భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేత కార్యక్రమం చేపట్టింది.సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమంలో యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి,( Vikram Doraiswami ) భారత ఆర్మీ అధికారులు, భారత్‌కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, బ్రిటిష్ అధికారులు పాల్గొన్నారు.దొరైస్వామి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక ప్రసంగిస్తూ, గత 77 ఏళ్లలో భారతదేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, సాంకేతిక నైపుణ్యం, సాఫ్ట్ పవర్‌తో సహా అనేక విజయాలను ప్రస్తావించారు.
భారతదేశం ఎదుర్కొంటున్న పేదరికం, అసమానతలు, వాతావరణ మార్పుల వంటి సవాళ్ల గురించి కూడా ఆయన మాట్లాడారు.తర్వాత ఈ వేడుకలలో భారతీయ శాస్త్రీయ నృత్యకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు ప్రదర్శనలు ఇచ్చారు.
భారతీయ సంప్రదాయ దుస్తులతో కూడిన ఫ్యాషన్ షో కూడా జరిగింది.ఈ కార్యక్రమానికి లండన్‌లోని( London ) భారతీయ కమ్యూనిటీ సభ్యులు, అలాగే బ్రిటిష్ పౌరులు బాగా హాజరయ్యారు.
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం విలువలపై మన నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒక అవకాశమని దొరైస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.భారతదేశం( India ) ప్రపంచ వేదికపై ఎదుగుతున్న శక్తి” అని, అందరికీ మంచి భవిష్యత్తును నిర్మించడానికి యూకే, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
ఇండియా, యూకే మధ్య భాగస్వామ్యం ఈనాటిది కాదని చెప్పవచ్చు.అవి వాణిజ్యం, పెట్టుబడి, భద్రతలో ముఖ్యమైన భాగస్వాములు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు( Independance Day ) హాజరైన ప్రవాసులందరూ చాలా ఉత్సాహంగా కనిపించారు.ఆగస్టు 15 యూకేలో ఒక వర్కింగ్ డే అయినప్పటికీ 600 మంది దాకా వేడుకలలో పాల్గొన్నారని దొరైస్వామి పేర్కొన్నారు.