భద్రత దళాల చేతికి మరో కొత్త ఆయుధం.. లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రబల్..!

భారతదేశంలోని ( India )భద్రత దళాల చేతికి మరో సరికొత్త ఆయుధం ఈనెల 18వ తేదీ అందనుంది.దేశీయంగా రూపొందించిన ఈ సరికొత్త ఆయుధం పేరు లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రబల్( Long Range Revolver Probal ).ఈ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది.గతంలో తయారుచేసిన రివాల్వర్ కంటే ఈ ప్రబల్ రివాల్వర్ రేంజ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏడబ్ల్యూఈఐఎల్ తేలిపింది.

 Another New Weapon In The Hands Of The Security Forces Long Range Revolver Prab-TeluguStop.com

ఈ ప్రబల్ రివాల్వర్ తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా గురిపెట్టవచ్చు.

ఈ ప్రబల్ రివాల్వర్ తక్కువ బరువు కలిగి ఉంటుంది. స్వింగ్ సైడ్ సిలిండర్ ( Swing side cylinder )తో సులభంగా 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదిస్తుంది.గతంలో దేశీయంగా తయారైన రివాల్వర్ల రేంజ్ కేవలం 20 మీటర్లు మాత్రమే.

ఈ ప్రబల్ రివాల్వర్ 76 మి.మీ బ్యారెల్ తో 700 గ్రాముల బరువు ఉంటుంది.మహిళలు కూడా స్వీయ భద్రత కోసం సులభంగా తమతో తీసుకెళ్లవచ్చు.ఆగస్టు 18 వ తేదీ నుండి ప్రబల్ రివాల్వర్ బుకింగ్స్ ప్రారంభమవుతాయి.లైసెన్స్ కలిగి ఉన్న సామాన్యులు సైతం ఈ ప్రబల్ రివాల్వర్ ను కొనుగోలు చేయవచ్చని ఏడబ్ల్యూఈఐఎల్ డైరెక్టర్ ఏకే మౌర్య ( Director AK Maurya )తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్నిర్మాణంలో భాగంగా 2021 లో 7 పీఎస్యూలను ఏర్పాటు చేసింది.అందులో ఈ ఏడబ్ల్యూఈఐఎల్ కూడా ఒకటి.ఈ సంస్థ భద్రతా దళాల కోసం ఆయుధాలను తయారుచేస్తుంది.ఈ 2023 సంవత్సరంలో ఈ సంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది.భారత సైన్యం కోసం 300 ఫిరంగుల తయారీతో పాటు, యూరోపియన్ దేశాలకు సంబంధించి రూ.450 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీ ఆర్డర్లను తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube