సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా ‘‘ఖుషి” ( Khushi ).
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే వచ్చిన పాటలతో వీరి కెమిస్ట్రీ ఎంత అందంగా ఉందో చూపించడమే కాకుండా మరిన్ని అంచనాలు పెంచేసాయి.

ఒక్కో పాట ఒక్కో చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు మరిన్ని పెరిగాయి. శివ నిర్వాణ( Shiva Nirvana ) ఈసారి హిట్ కొట్టడం పక్కా అనేలా ట్రైలర్ కట్ ఉంది.
ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా యూఎస్ రిలీజ్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.యూఎస్ లో ఈ సినిమా సాలిడ్ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.అక్కడ ఏకంగా 500 కు పైగానే లొకేషన్స్ లో రిలీజ్ కాబోతుండడం విశేషం.
ఒక లవ్ స్టోరీకి ఆ రేంజ్ లో భారీ సంఖ్యలో రిలీజ్ దొరకడంతో ఓపెనింగ్స్ కుమ్మేయనుంది అంటున్నారు.కాగా ట్రైలర్ తో ప్రమోషన్స్ జోరు మరింత స్టార్ట్ అవ్వగా నెక్స్ట్ అప్డేట్ ఏంటా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.ఈ లవ్ స్టోరీ విజయ్ కు సమంతకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.