లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ లో భరతమాతను హత్య చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మణిపూర్ ముక్కలు కాలేదన్న ఆమె మణిపూర్ కూడా భారత్ లో భాగమేనని తెలిపారు.
భరతమాత హత్య గురించి దేశ చరిత్రలో ఎవరూ మాట్లాడలేదన్న స్మృతి ఇరానీ దేశ విభజన గురించి మాట్లాడేది కాంగ్రెస్ మిత్రపక్షాలేనని పేర్కొన్నారు.విపక్షాలది ఇండియా కూటమి కాదన్న ఆమె అవినీతి కూటమంటూ మండిపడ్డారు.
కశ్మీర్ లో అరాచకాలను కళ్లకు కడితే ప్రోపగాండ అన్నారన్నారు.మణిపూర్ ఘటనలపై వేగంగా స్పందించామన్న కేంద్రమంత్రి దోషులను కఠినంగా శిక్షించాలని సీఎంను కోరామని తెలిపారు.
దాంతోపాటు అక్కడ సీబీఐ విచారణ జరుగుతోందని వెల్లడించారు.