టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు.
ఇకపోతే నేడు మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే.మరి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కాగా మహేశ్ 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు.ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ( Superstar Krishna ) 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.
ఆరేళ్ల వయసులో మహేశ్ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు.అప్పట్లో దాసరి దర్శకత్వంలో నీడ సినిమా రమేశ్ చేస్తున్నారు.
అందులో ఒక కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి.అలా బాల నటుడిగా మహేశ్ ఎంట్రీ ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది.తర్వాత మహేష్ తండ్రి కృష్ణతో కలిపి పోరాటంసినిమాలో మహేశ్ నటించి, మెప్పించారు.స్కూల్ హాలీడేస్ రాగానే షూటింగ్స్‌లో మహేశ్ పాల్గొనేవాడు.అలా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు( Mugguru Kodukulu ), గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం సినిమాలు చేశాడు.తర్వాత మహేశ్ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు.
సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు.పదో తరగతిలో అనుకునన్ని మార్కులు రాకపోవటంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ రాలేదు.
కనీసం డిగ్రీలో అయినా అక్కడ సీటు సంపాదించాలని ఇంటర్‌లో కష్టపడి చదివి ఆపై మంచి మార్కులు సాధించి అనుకున్నట్లే లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ సీటు సాధించాడు.అక్కడ చదువుతున్న టైంలో మళ్లీ సినిమాలవైపు మనసు లాగింది.ఇంకేముంది ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పడం.దానికి కృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి.అప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్. రాజకుమారుడు సినిమా( Rajakumarudu )తో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు.
అయితే తెలుగులో ఇప్పటివరకూ ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని హీరో మహేశ్.బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తెలుగు సినిమాల్లోనే నటిస్తానని వాటిని తిరస్కరిస్తూ వచ్చారు.
మహేశ్‌లో నిర్మాత కూడా ఉన్నాడు.