గుడివాడలో మెగాస్టార్ అభిమానుల ఆందోళన

చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ అరెస్ట్మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను( Chiranjeevi fans ) విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

 Megastar Fans Chiranjeevi Are Worried In Gudivada , Buragadda Srikanth , Gudi-TeluguStop.com

అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్ళనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది.ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్( Buragadda Srikanth ) తోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేయడంతో, పోలీసు వాహనాలను ముందుకు వెళ్ళనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు.

భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube