గుడివాడలో మెగాస్టార్ అభిమానుల ఆందోళన
TeluguStop.com
చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ అరెస్ట్మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
డౌన్ డౌన్ కొడాలి నాని.జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను( Chiranjeevi Fans ) విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్ళనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది.
ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్( Buragadda Srikanth ) తోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేయడంతో, పోలీసు వాహనాలను ముందుకు వెళ్ళనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు.
భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?