నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపి సారంగపాణి తెలిపారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ తో లైసెన్సు,నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న వాహనాలు సీజ్‌ చేసి జరిమానా విధిస్తున్నారని తెలిపారు.

 Khammam Traffic Police Seized 200 Vehicles That Were Running In Violation Of The-TeluguStop.com

ఆనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చిన వారికి వాహనాలను తిరిగి అప్పగిస్తునట్లు తెలిపారు.నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు.

ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని నంబర్ ప్లేట్ లేకున్నా వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

స్టైల్, వెరైటీ, ఫ్యాషన్ పేర్లతో తమ బైక్‌లకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

అందులో భాగంగా ఇటీవల సైలెన్సర్స్ విక్రయించే షాపులు,సైలెన్సర్స్ బిగించే మెకెనిక్ షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలు వల్ల తోటి వాహనదారులు, స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

కొన్ని సయయాల్లో కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

కార్యక్రమంలొ ట్రాఫిక్ సిఐ ఆశోక్ , ఎస్సై రవి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube