ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతూ పలు సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి మెహర్ రమేష్( Meher Ramesh ) గత కొన్ని సినిమాల నుంచి వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు.ఇలా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నటువంటి మెహర్ రమేష్ కి చిరంజీవి భోళా శంకర్ సినిమా( Bhoola Shankar ) చేసే అవకాశాన్ని కల్పించారు.
ఈ సినిమా ద్వారా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మెహర్ రమేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పాలి.అయితే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ తాను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని అలాంటిది ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని ఈ సినిమాతో నా కల కూడా నెరవేరిందని రమేష్ తెలిపారు.ఇక ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా చిరంజీవి గురించి రమేష్ మాట్లాడుతూ షాడో లో ఉన్న నా జీవితానికి చిరంజీవి( Chiranjeevi ) వెలుగులు పడ్డాయని తెలిపారు.ఇలా వరుస పరాజయాలతో సతమతమవుతున్నటువంటి తనకు చిరంజీవి అవకాశం కల్పించారని పరోక్షంగా ఈయన తెలియజేశారు.
ఇలా చిరంజీవి గారు అవకాశం ఇవ్వడం నాకు పునర్జన్మ లాంటిదని రమేష్ తెలిపారు.
అన్నయ్య నిండైన ప్రేమ మూర్తి ఎవరిపైన అయినా కోపం వస్తే సహనంతో ఉండాలి రా అని మందలించే గొప్ప వ్యక్తిత్వం చిరంజీవి అన్నయ్యది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోకి చెల్లిగా నటించాలి అంటే మెగా నటి అయ్యి ఉండాలని భావించాను అయితే చివరికి మహానటి మెగా చెల్లెలుగా( Keerthy Suresh ) ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన కీర్తి సురేష్ గురించి కూడా తెలిపారు.ఈ విధంగా మెహర్ రమేష్ చిరంజీవి గురించి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.