రాహుల్ గాంధీ ప్రయత్నాలన్నీ వేస్టే ?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Rahul Gandhi ) పి‌ఎం కావాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో కోరుకుంటోంది.రాహుల్ గాంధీ కూడా పి‌ఎం పదవి కోసమే.

 Rahul Gandhi Wont Be Pm Survey Results,rahul Gandhi,pm Modi,prime Minister,modi-TeluguStop.com

పార్టీ అధ్యక్ష హోదా నుంచి కూడా తప్పుకున్నారు.అయితే రాహుల్ గాంధీకి రాజకీయ పరిణితి లేదని ఆయన పి‌ఎం పదవికి అర్హుడు కాదని ప్రత్యర్థి పార్టీలు మొదటి నుంచి గట్టిగానే విమర్శిస్తూ వస్తున్నాయి.

మొదట్లో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు కొంత తడబడినప్పటికి ఇప్పుడు తనను తాను మలచుకుంటూ ప్రజలకు అసలైన కాంగ్రెస్ నాయకుడిగా కనిపిస్తున్నాడు.మోడి సర్కార్( Modi Government ) పై తనదైన రీతిలో విమర్శలు గుప్పించడం, ప్రజల్లో సామాన్యుడిలా కలసి పోవడం వంటివి చేస్తూ తనకు తను ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Telugu Congress, Modi, Pm Modi, Prime, Rahul Gandhi, Surey-Politics

ఇక గత ఏడాది ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర( Bharat Jodo Yatra )కు ప్రజల్లో మంచి స్పందన తీసుకొచ్చింది.ఆ యాత్రతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka Assembly Elections ) కూడా విజయం సాధించింది.ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు విస్తున్నాయి.ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హస్తం విజయం సాధించడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూడా మోడీకె పట్టం కట్టాయి.

కేంద్రంలో మూడో సారి కూడా మోడీనే అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పాయి.

Telugu Congress, Modi, Pm Modi, Prime, Rahul Gandhi, Surey-Politics

దీంతో రాహుల్ గాంధీ ఇప్పుడేన్ని ప్రయత్నాలు చేసిన వేస్టేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.ప్రస్తుతం విపక్షాలన్నిటిని కలుపుకున్నప్పటికి హస్తం పార్టీకి విజయం కష్టమే అని చెబుతున్నాయి సర్వేలు.దాంతో మళ్ళీ అధికారం కోసం 2029 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

ఈలోగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం.కాంగ్రెస్ మరింత బలపడుతుందా లేదా బలహీన పడుతుందా అనేది చెప్పలేని పరిస్థితి.

కాగా ఈ ఏడాది ఐదు రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో జయాపజయాలను బట్టి హస్తం పార్టీ భవిష్యత్త్ ఆధారపడి ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఏం జరగబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube