హీరో ఆర్యన్ రాజేష్ కెరియర్ ఫెయిల్యూర్ అవ్వడానికి అదే కారణమా?

హీరో ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) పరిచయం అవసరం లేని పేరు.ఇప్పటి తరం వారికి ఈయన పెద్దగా తెలియకపోయినా కానీ ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఆర్యన్ రాజేష్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

 Is That The Reason For The Failure Of Hero Aryan Rajesh Career Details, Aryan Ra-TeluguStop.com

ఆర్యన్ రాజేష్ ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ(EVV Satyanarayana) కుమారుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ విధంగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆర్యన్ రాజేష్ అనంతరం నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఆర్యన్ రాజేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)సినిమాలో రామ్ చరణ్ కు అన్న పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయనకు ఇతర సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.దీంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది.అయితే తన తండ్రి ఈవివి సత్యనారాయణ గారు బ్రతికున్నంత కాలం ఈయన వరుస సక్సెస్ సినిమాలలో నటించారు.అయితే ఆయన మరణాంతరం ఆర్యన్ రాజేష్ హీరోగా పెద్దగా మెప్పించలేకపోయారు.

తన తండ్రి బ్రతికే ఉన్న సమయంలో ఆర్యన్ రాజేష్ సినిమా కథల ఎంపిక విషయంలో తన తండ్రి పాత్ర కీలకంగా ఉండేదని తెలుస్తోంది.రాజేష్ తండ్రి గారు మరణించిన తర్వాత కథల ఎంపిక విషయంలో ఈయన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఇలా వరుసగా ఫెయిల్యూర్ తనని వెంటాడాయని ఇదే తన కెరియర్ ను నాశనం చేసిందని తెలుస్తుంది.అయితే సినిమాలలో వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఈయన ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేస్తున్నారనీ తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube