Talulah Riley : ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య.. నెట్టింట ఫోటోస్ వైరల్?

తరచూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఉంటాయి.ముఖ్యంగా ప్రేమ పెళ్లి డేటింగ్ లకు సంబంధించి అనేక రకాల వార్తలు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి.

 Elon Musks Ex Wife Talulah Riley Is Engaged To Actor Thomas Brodie Sangster-TeluguStop.com

అభిమానులు కూడా సెలబ్రిటీలకు( celebrities ) సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.ఇక సినిమా ఇండస్ట్రీలో అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు విషయాలలో ప్రేమ, పెళ్లి, విడాకులు డేటింగ్స్ అన్నవి కామన్.

ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్ ఫౌండర్ ఎలాన్ మస్క్( Elon Musk ), మాజీ భార్య తలులా రిలేకు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

Telugu Elon Musks, Talulah Riley, Thomasbrodie-Movie

ఈ జంట చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె ఒక పాపులర్ యాక్టర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.అలాగే థామస్ బ్రాడీ సాంగ్‌స్టర్‌తో త్వరలోనే ఏడడుగులు వెయ్యనుంది.

ఈ జంట గత రెండేళ్లుగా డేటింగ్ లో మునిగి తేలుతున్నారు.కాగా ఇటీవలే ఆమె తనకు తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసింది.

అయితే తన మాజీ భార్య మరో పెళ్లికి సిద్ధమవుతుందని తెలిసి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్‌ ఎమోజీతో కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.ఇక థామస్ ( Thomas )కూడా తమకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కన్ఫమ్ చేశాడు.2021లో డేటింగ్ స్టార్ట్ చేశాము.త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము అని చెప్పుకొచ్చారు.

Telugu Elon Musks, Talulah Riley, Thomasbrodie-Movie

అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.ప్రస్తుతం రిలే ఆమె బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ జంట ఫోటోలను చూసిన నెటిజన్స్ పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా రిలే,ఎలాన్ మస్క్ మాజీ భార్య కావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube