'బ్రో ది అవతార్' మొదటి రోజు వసూళ్లు..నెగటివ్ టాక్ తో బీభత్సం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్( Bro the Avatar )’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలై డివైడ్ టాక్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.విడుదలకు ముందు నుండే రీమేక్ కారణం గా అభిమానులు ఈ చిత్రం పై అంచనాలు చాలా తక్కువగా పెట్టుకున్నారు.

 'bro The Avatar' Movie First Day Collection , 'bro The Avatar , First Day Collec-TeluguStop.com

అందులోనూ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )ఇందులో మెయిన్ లీడ్ క్యారక్టర్ చెయ్యడం లేదు, కేవలం ముఖ్యమైన పాత్ర పోషితున్నాడు అని ముందే తెలియడం తో ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపలేదు.కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి.

కొంతమంది స్టార్ హీరోల రీసెంట్ కమర్షియల్ మూవీస్ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.సరైన పాటలు, సరైన హైప్ లేకుండా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు.

ఒకసారి ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాము.

Telugu Bro Avatar, Day, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood,

తెలంగాణ రాష్ట్ర ( Telangana State )వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన భారీ వానలు, వరదలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలాంటి సమయం లో విడుదల అవుతున్న ఈ చిత్రం కచ్చితంగా నైజాం ప్రాంతం లో తక్కువ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు.కానీ అక్కడ ఉన్నది పవర్ స్టార్, నిన్న సాయంత్రం నుండి కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని రాబట్టి మరోసారి తాను నైజాం కింగ్ అనిపించుకున్నాడు.

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఈ ప్రాంతం లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అతి తక్కువ షోస్ తో ఇది సాధారణమైన వసూళ్లు కాదనే చెప్పాలి.

కానీ సీడెడ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ రేంజ్ వసూళ్లు రాబట్టలేదు.ఇక్కడ కేవలం మొదటి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

కమర్షియల్ సినిమా కాకపోవడం, పాటలు , ఫైట్స్ లేకపోవడం వల్లే ఈ ప్రాంతం లో తక్కువ వసూళ్లను రాబట్టడానికి కారణం అని అంటున్నారు.

Telugu Bro Avatar, Day, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood,

కేవలం సీడెడ్ తప్ప , మిగిలిన అన్నీ ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.కేవలం ఆంధ్ర + సీడెడ్ కలిపి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలంగాణ కలిపి 25 కోట్లు , అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇదే ఊపుని కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంటున్నారు.

సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చిందని, అందుకే ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.మరి ఇదే రేంజ్ ఊపుని సోమవారం నుండి చూపిస్తుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube