దానిమ్మ గింజలు తినేటప్పుడు ఇలా అనిపించిందా? అయితే అదే?

దానిమ్మ గింజలు( Pomegranate Seeds ) ఎవరికి చేదు.మనలో చాలామంది దానిమ్మను చాలా ఇష్టంగా తింటూ వుంటారు.

 Man Says Pomegranate He Ordered Online Tastes Like Nail Polish Details, Pomegran-TeluguStop.com

ఇంకా చాలామంది దాన్ని తింటే బ్లడ్ బాగా మెరుగుపడుతుందని ఫీల్ అవుతూ వుంటారు.నిజమే, ఆరోగ్య నిపుణులు కూడా వాటిని బాగా తినమని చెబుతూ వుంటారు.

అలా దానిమ్మ తినాలని అనుకున్న వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.ఇష్టమైన పండుకదాని దానిమ్మను తింటూ ఉండగా అతగాడికి నాలిక కాలిపోయింది.

ఏంటి ఆశ్చర్యంగా వుంది కదూ.పైగా వాసన కూడా మనోడికి తేడా కొట్టేసింది.

యూట్యూబర్ సమ్దీష్ భాటియా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుండి ఆర్డర్ చేసిన దానిమ్మ( Pomegranate ) బాక్స్ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ పోస్ట్ కాస్త ఇపుడు వైరల్ అవుతోంది.అవును, అతను తిన్న దానిమ్మ గింజల నెయిల్ పాలిష్ వాసన( Nail Polish ) వచ్చాయని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా సమ్దీష్ ఆ బాక్స్ ఫోటోని షేర్ చేసాడు.

రుచి చూసిన వెంటనే, ‘నెయిల్ పాలిష్’ లాంటి వాసన వచ్చిందని ఓ యాప్‌పై ఫిర్యాదు చేయాలనుకున్నాడు సమ్దీష్.దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.తిన్న వెంటనే రుచిలో తేడా అనిపించి గింజల్ని వెంటనే ఉమ్మివేసినప్పటికీ, సమ్దీష్ తన నాలుక కాలినట్లు ఫీల్ అయ్యాడట పాపం.

Telugu Fruit, Latest, Pomegranate-Latest News - Telugu

అయితే, ఈ కారణాన్ని వివరించడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చి దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని వివరించడం కొసమెరుపు.ఈస్ట్ చక్కెరను తినడం వల్ల దానిమ్మ గింజలు చెడు వాసన, నెయిల్ పాలిష్ రిమూవర్ లాగా రుచితో మారతాయని వివరణ ఇచ్చాడు సదరు వ్యక్తి.అయితే సరైన కారణాలు తెలియకపోయినా ఈ రకంగా మారేందుకు రెండు కారణాలను అయన చెప్పుకొచ్చారు.ఒకటి ఈస్ట్( Yeast ) చక్కెరను తినడం వల్ల ఇలా అయి ఉండవచ్చు.

Telugu Fruit, Latest, Pomegranate-Latest News - Telugu

రెండు దానిమ్మ పండు గింజలు మరింత అందంగా ఆకర్షణతో కనిపించేలా ఉండేందుకు ఇలా నెయిల్ రంగు వేసి అయినా ఉండవచ్చని చెప్పుకొచ్చాడు.కాగా స్విగ్గి ఇన్‌స్టామార్ట్ మనీకంట్రోల్‌తో ఇదే విషయం గురించి మాట్లాడతే వాళ్ళ నుంచి వేరే సమాధానం వచ్చింది.సదరు దానిమ్మపండుతో సహా మా ఉత్పత్తులన్ని సహజమైన సువాసనతో ఉంటాయేకానీ ఎటువంటి హాని చేయవని, ఆ బ్రాండ్ వివరణ ఇవ్వడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube