గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటున్నవిజయసాయి

విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) , వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు గానే కాకుండా వైఎస్ జగన్కు అనుంగ అనుచరుడిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో పేరుపొందారు.జగన్ అవినీతి కేసుల్లో జగన్ ( CM jagan )తో పాటు జైలుకు కూడా వెళ్ళవచ్చిన విజయసాయిరెడ్డి ఆ తదనంతరనామాలలో జగన్ కు రాజకీయ అనుచరుడిగా రాష్ట్ర రాజకీయాల్లో పేరు పొందారు.2019లో వైసీపీ అధికారం లోకి రావడానికి ఇతోదికం గా కృషి చేసిన విజయసాయిరెడ్డి తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పార్టీ లో కొంత సైలెంట్ అయ్యారు.ఉత్తరంద్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ స్థానిక నేతలతో వచ్చిన విభేదాల వల్లే ఆయన అలిగి పార్టీకి దూరమయ్యారని విశ్లేషణలు వినిపించాయి.

 Number 2 Reactivated , Vijaya Sai Reddy, Janasen , Ycp, Ys Jagan, Ap Politics ,-TeluguStop.com

అంతేకాకుండా ఆయన పార్టీ మారబోతున్నారని జగన్తో విభేదాలు వచ్చాయని ప్రచారాలు కూడా జరిగాయి.అయితే చాలా కాలం తర్వాత వైసీపీ సెంట్రల్ ఆఫీసులో కనిపించిన విజయసాయి కొత్త జోష్తో కార్యకర్తలతో మాట్లాడారట.

Telugu Ap, Janasen, Ys Jagan-Telugu Political News

అంతేకాకుండా రీజనల్ కోఆర్డినేటర్ వంటి కీలక పదవి తనకు ఇవ్వడంతో వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ స్పీడ్ పెంచేసారట .దాంతో వైసిపి కార్యకర్తల్లో ఆనందం కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి.ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున రేయింబవళ్ళు కష్టపడి పార్టీలోకి అధికారంలోకి తీసుకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారట.

Telugu Ap, Janasen, Ys Jagan-Telugu Political News

గత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీలో కొంత యాక్టివ్ గా లేని వాతావరణం కనిపించిందని.అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవని, ఇకపై నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని.అందరం కలిసి పార్టీని తిరిగి అధికారులకు తీసుకువద్దామంటూ కార్యకర్తలతో వ్యాఖ్యానించారట.

జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు పెడుతు లోటుపాట్లు సరిచేస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో ఆక్టివ్ అయ్యారట .ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆయన పార్టీ మారతారేమో అని ఆందోళన చెందిన వైసిపి( YCP party ) ) శ్రేణులు ఆయన పునరాగమనం చేసి మళ్ళీ యదావిధి గా కీ రోల్ పోషించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube