వైరల్ వీడియో: బండరాయిపై నిల్చొని జలపాతం చూస్తుండగా జారిన కాలు... క్షణాల్లోనే గల్లంతు..

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వరదలు దంచికొడుతున్నాయి.ఈ నేపథ్యంలో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

 Viral Video: Leg Slipped While Standing On A Rock And Watching The Waterfall...-TeluguStop.com

జలపాతాలు కూడా భారీ వరద నీటితో నీటిని జాలు వారుస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి.వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.తాజాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లా అరసినగుండి జలపాతం( Arasinagundi waterfall ) వద్ద ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఈ ఘటనలో 23 ఏళ్ల యువకుడు జలపాతం చూస్తూ ఒక బండ రాయిపై నిల్చున్నాడు.ఆ జలపాతం నుంచి నీరు పెద్ద ఎత్తున వస్తోంది.

ఆ నీటి పక్కనే ఉన్న ఒక బండరాయిపై ఇతగాడు నిల్చున్నాడు.

తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్( Instagram Reels ) రికార్డ్ చేయడం ప్రారంభించాడు.పోజులు ఇస్తూ అతను ఇన్‌స్టా రీల్స్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాడు.అతనితోపాటు అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా వీడియో తీయడం మొదలుపెట్టారు.

ఇంతలోనే ఎవరూ ఊహించని ఘటన జరిగింది.అదేంటంటే, ఆ యువకుడు కాలు జారింది.

అంతే క్షణాల్లోనే అతడు రాయిపై పడిపోయాడు.ఆపై రెప్పపాటులో నీటిలో పడి అందరూ చూస్తుండగానే క్షణాల్లో కొట్టుకుపోయాడు.

అలా గల్లంతయిన యువకుడు ఇప్పటివరకు దొరకపోవడం విషాదకరం.ఈ షాకింగ్ ఘటన ఆదివారం సాయంత్రం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

బాధితుడిని శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన శరత్ కుమార్ (23)గా గుర్తించారు.

శరత్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.భద్రావతి నుంచి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి కారులో బయలుదేరిన శరత్ కాసేపటికి అరసినగుండి జలపాతం వద్దకు వచ్చాడు.మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జలపాతం సమీపంలోని బండపై నిల్చోని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించాడు.దురదృష్టం కొద్దీ అతడి కాలు స్లిప్ అయింది.వెను వెంటనే సౌపర్ణికా నదిలో పడిపోయాడు.కళ్ళు మూసి తెరిచేలోగా అదృశ్యమయ్యాడు.ఆ నది ప్రవాహంలో మొత్తం పదునైన రాళ్లు, జారేతత్వం ఉన్న బండ రాళ్లు ఉన్నాయి.

దీనివల్ల యువకుడు ప్రాణాలతో బతికే అవకాశం తక్కువ అని అధికారులు అంటున్నారు.ఈ ఘటనకు సంబంధించి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో శరత్ జలపాతం నీటిలో పడిపోయి కొట్టుకుపోయినట్టుగా కనిపించింది.దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరోవైపు అధికారులు నదులు, జలపాతాల వద్దకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube