అర్జెంటుగా ఈ పని చేయకపోతే జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్స్‌ డిలీట్ అయిపోతాయి..!

టెక్ దిగ్గజం గూగుల్ ఇన్‌యాక్టివ్ గూగుల్ అకౌంట్స్ మేనేజ్ చేసే విధానంలో మార్పులు చేస్తోంది.కనీసం రెండు ఏళ్ల పాటు గూగుల్ అకౌంట్‌( Google Account )ను ఉపయోగించకుంటే, దానిని మరో ఆలోచన లేకుండా డిలీట్ చేయాలని గూగుల్ సంస్థ నిర్ణయించింది.

 If You Don't Do This Urgently, Gmail And Youtube Accounts Will Be Deleted Google-TeluguStop.com

దీనర్థం గూగుల్ అకౌంట్‌కు రెండేళ్లలో ఒకసారి కూడా లాగిన్ చేయకుంటే జీమెయిల్, యూట్యూబ్ లేదా గూగుల్ ఫోటోలు వంటి వాటిని ఉపయోగించకుంటే, మీ గూగుల్ అకౌంటు డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది.సెక్యూరిటీ నిమిత్తమే గూగుల్ ఈ చర్య తీసుకుంటోంది.

Telugu Gmail, Google, Inactive, Tech, User Security, Emails, Youtube-Technology

జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్లను తొలగించే తేదీకి 8 నెలల ముందు నుంచి గూగుల్ హెచ్చరిక ఈ-మెయిల్స్‌ను పంపుతుంది.తద్వారా అకౌంట్ డిలీట్ కాకూడదనుకునేవారు వాటిని మళ్లీ యాక్టివ్‌గా ఉంచుకుంటూ జాగ్రత్త పడొచ్చు.అకౌంట్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ఈ మార్పుకు కారణం.ఇన్‌యాక్టివ్ అకౌంట్స్ వీక్ పాస్‌వర్డ్‌లను కలిగి ఉండటం, ముఖ్యమైన సెక్యూరిటీ యాక్షన్స్ లేకపోవడం వల్ల హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఉపయోగించని ఖాతాలను తొలగించడం ద్వారా, హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించి, దాని వినియోగదారులను మరింత మెరుగ్గా రక్షించవచ్చని గూగుల్ భావిస్తోంది.

Telugu Gmail, Google, Inactive, Tech, User Security, Emails, Youtube-Technology

గూగుల్ అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే, డిలీట్ అవ్వకుండా నిరోధించాలనుకుంటే, ఈ-మెయిల్‌ను తరచుగా చెక్ చేస్తుండాలి.అలానే గూగుల్ అకౌంట్ తో లింక్ అయిన గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్ వినియోగిస్తుండాలి.ఇలాంటి సింపుల్ పనులు చేస్తే చాలు అకౌంట్ డిలీట్ కాకుండా జాగ్రత్త పడవచ్చు.

ముఖ్యమైన గూగుల్ అకౌంట్ పక్కన పెట్టి వేరే అకౌంట్ తో ఈ పనులు చేస్తూ ఉంటే ఆ ముఖ్యమైన దానిని యాక్టివ్ చేసుకోవడం మంచిది.ఈ మార్పు పర్సనల్ గూగుల్ అకౌంట్లను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

స్కూల్స్ లేదా బిజినెస్ గూగుల్ అకౌంట్ లో డిలీట్ కావని గమనించాలి.గూగుల్ భద్రతను మెరుగుపరచడానికి, ఇన్‌యాక్టివ్ ఖాతాలను నిర్వహించడానికి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనుసరించడానికి ఈ పని చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube