మరికొద్ది నెలలు జరగబోతున్న తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ( Congress ) దూకుడు పెంచింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో తెలంగాణలోనూ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది.
అధికారి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, బిజెపి గ్రాఫ్ కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గిందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది .ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించడంతో పాటు, వ్యవహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.గతంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నంత స్థాయిలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు కనిపించడం లేదు.

పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల కీలక నాయకులు అందరిలోనూ ఉండడం కాంగ్రెస్ కు కలిసి వస్తుంది.ఇక తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు కర్ణాటక ఎన్నికల ఫార్ములానే ఉపయోగించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.కొద్దిరోజుల క్రితం ఉచిత విద్యుత్ అంశం పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
వ్యవసాయానికి మూడు గంటలకు విద్యుత్ సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, కాంగ్రెస్ కు డ్యామేజ్ జరగడంతో వివరణ ఇచ్చింది.తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు పెంచే విధంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా ఉన్న సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) తప్పించి ఆయన స్థానంలో రాజకీయ మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ ను( Sasikanth Senthil Kumar ) నియమించుకోవాలని నిర్ణయించుకుంది.

త్వరలోనే ఆయన ఆ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.కర్ణాటక లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడానికి కారణమైన సునీల్ కానుగోలు కు కాంగ్రెస్ ప్రమోషన్ ఇచ్చింది.ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం సునీల్ ను ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు .దీంతో తెలంగాణ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టలేని పరిస్థితి నెలకొనడంతో సునీల్ కానుగోలు స్థానంలో శశికాంత్ సెంథిల్ కుమార్ ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈయన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేశారు.
సునీల్ కానుగోలు టీం లో సభ్యుడుగా పనిచేశారు.త్వరలోనే తెలంగాణ వ్యూహకర్త ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు 40 మందితో ఒక ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుని బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.