సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతం అనిపించే వీడియోలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
ముఖ్యంగా జంతువులు( Animals ), చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.జంతువులు వెంటాడే వీడియోలు, జంతువుల మధ్య వివిధ పద్దతుల ద్వారా జరిగే సంభాషణలతో కూడిన వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ చర్చనీయాంశంగా మారింది.
మాములుగా పిల్లులు( cats ) అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.ఇవి మన ఇంట్లోనే తిరుగుతూ మనకు రోజూ కనిపిస్తూ ఉంటాయి.ఇంట్లో పాలు తాగడం లాంటి పనులు చేస్తూ ఉంటాయి.
దీంతో పిల్లులు నేలపాలు చేయకుండా, అవి తాగకుండా ఉండేందుకు పాలను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటూ ఉంటారు.ఇంకా చాలామంది ఇళ్లల్లో పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటారు.
వాటికి ఆహారం పెడుతూ తమ సొంత మనిషిలా చూసుకుంటారు.అయితే పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటూ సౌండ్ చేస్తూ ఉంటాయి.
దీని ద్వారా తమ సంభాషలను వేరే వారికి తెలియచేస్తాయి.
తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పిల్లులు ఒకదానికొకటి ఏవో మాట్లాడుకుంటున్నాయి.సౌండ్ ల రూపంలో తమ సంభాషణలను షేర్ చేసుకుంటున్నాయి.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ( Harsh Goenka )ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఇందులో రెండు పిల్లులు చాలా క్యూట్ గా కనిపించాయి.ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపించాయి.అయితే అవి మాట్లాడుకుంటున్నాయా.లేదా గొడవ పడుతున్నాయా అనేది అర్ధం కావడం లేదు.
మా ఇంటి బయట ఎవరో చిన్నపిల్లలు గొడవ పడుతున్నట్లు అనుకుని బయటకు వచ్చి చూశానని, కానీ రెండు పిల్లలు గొడవ పడుతూ ఇలా కనిపించాయని హర్ష గోయెంకా తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.