టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన చిత్రం బ్రో( Bro ).త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు సముద్రఖని ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ లను విడుదల చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కొక్క అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఇకపోతే ఈ సినిమా వినోదయ సీతమ్( Vinodya Seetham ) కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది.ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.
టాకీ పార్టును ఎంతో వేగంగా కంప్లీట్ చేసుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా తిరుగుతున్నాయి.
అదే సమయంలో ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలను కూడా వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లీక్ విడుదల అయింది.
ఇందులో సాయి ధరమ్ తేజ్ మార్కండేయుడి పాత్రలో( Markandeya’s role ) నటిస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ కాలుడు అనే పాత్రలో కనిపించబోతున్నాడు.కాగా తాజా సమాచారం ప్రకారం.ఈ చిత్రం పవన్, సాయి తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయట.
అంతేకాదు, ఇందులో తరచూ పవర్ స్టార్ మైడియర్ మార్కండేయ మంచిమాట చెబుతా రాసుకోఅని చెబుతాడట.ఈ డైలాగ్ గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో మాదిరిగా ఉండడంతో ఇది కూడా హిట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలని ఇప్పటికే మూవీ మేకర్స్ విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు.