గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న బిజెపి కీలక నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి విజయ అవకాశాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.సుదీర్ఘకాలం భారతీయ రాష్ట్ర సమితి లో పనిచేసిన వ్యక్తిగా ఆ పార్టీ అనుసరించే వ్యూహా ప్రతి వ్యూహాలు, ఎత్తులు తనకు పూర్తిగా తెలుసని వాటిని దీటుగా ఎదుర్కొనేలా పార్టీ పరం గా కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
రెండుసార్లు వరుసగా అధికారంలోకి రావడంతో కేసీఆర్కు( CM KCR ) అహంకారం భారీ స్థాయిలో పెరిగిందని , ఆయన అహంకారానికి ఈ ఎన్నికలతో చెక్ పెడతామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో భాజపా లేదా బారాసా మాత్రమే గెలిచాయని దీనిని బట్టి తెలంగాణలో కాంగ్రెస్కు అవకాశం లేదన్న విషయం అర్థమవుతుందని, కాంగ్రెస్ ను ఓడించడానికి ఎవరూ రానవసరం లేదని , అసమ్మతి వర్గపోరుతో ఆ పార్టీ నేతలే ఒకరని ఒకరు ఓడించుకుంటారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.మాజీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ఆధ్వర్యంలో మూడు ఉప ఎన్నికలను గెలిచామని ఇప్పుడు అత్యంత సీనియర్ నాయకుడు ఆయన కిషన్ రెడ్డి( Kishan Reddy ) సారధ్యంలో తెలంగాణను గెలుచుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తనకు స్టీరింగ్ కమిటీ బాధ్యతలు అప్పజెప్పిన అధిష్టానం కు కృతజ్ఞతలు తెలిపిన ఈటెల ఆ బాధ్యతలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని చెప్పుకొచ్చారు.తనకు నాయకులు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలంగాణ ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని ఆయన మీడియా మిత్రులతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది.అందరినీ కలుపుకొని వెళ్లడానికి తాను ప్రాధాన్యత ఇస్తానని ఎవరు గెలిచినాపార్టీ టికెట్ పై గెలిచినట్లుగానే చూస్తామని అందరము కలిసి భాజపాను తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు.