ఖమ్మంలో( Khammam ) సీనియర్ ఎన్టీఆర్( Nandamuri Taraka Ramarao ) విగ్రహావిష్కరణ విషయంలో ఎన్ని వివాదాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కోర్టు స్టే వల్ల మే నెల 28వ తేదీన విగ్రహావిష్కరణ జరగలేదు.
కరాటే కళ్యాణితో పాటు మరి కొందరు కోర్టును ఆశ్రయించడం వల్ల విగ్రహావిష్కరణ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.అయితే నందమూరి అభిమానులు సంతోషించే విధంగా అద్భుతమైన శుభవార్త వెలువడింది.
సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని( Sr NTR Statue ) నిర్వాహకులు ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చేతుల మీదుగానే ఈ విగ్రహం ప్రారంభం కానుందని సమాచారం.
ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసే విగ్రహం విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు.సభ్యులు చకచకా పనులను పూర్తి చేస్తుండటంతో అతి త్వరలో విగ్రహావిష్కరణ జరగనుంది.కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని బోగట్టా.
ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.ఈసారి విగ్రహావిష్కరణను ఎవరూ ఆపలేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కోటి రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేశారని బోగట్టా.
ఉద్దేశపూర్వకంగా ఎవరూ రచ్చ చేసే అవకాశం లేకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం అందుతోంది.
ఈ మధ్య కాలంలో మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కోర్టులను ఆశ్రయించడం సాధారణం అయిపోయింది.ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ వివాదం చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.సోషల్ మీడియాలో వివాదాలు సృష్టించే వాళ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగితే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడం గమనార్హం.