ప్రభాస్ తో చేసే ఛాన్స్ వస్తే నా భర్తతో గొడవ పడటానికి అయినా సిద్ధమే: రంభ

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన వారిలో సీనియర్ నటి రంభ ( Rambha) ఒకరు.ఈమె తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా భోజపురి ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 I Am Ready To Fight With My Husband If I Get A Chance ,prabhas, Rambha, Ntr,-TeluguStop.com

రంభ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా సందడి చేశారు.ఎన్టీఆర్ ( NTR ) అల్లు అర్జున్ ( Allu Arjun ) వంటి హీరోల సినిమాలలో ఈమె స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేశారు.

ఇక పెళ్లయిన తర్వాత రంభ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి ఈమె విదేశాలలో స్థిరపడ్డారు.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రంభ టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ డాన్స్ పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసింది.

అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ ప్రభాస్ ( Prabhas ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల అని తెలిపారు.ప్రభాస్ తో కనుక నటించే అవకాశం వస్తే నా భర్తతో గొడవపడిన సరే ఆయన సినిమాలు నటిస్తానంటూ ఈ సందర్భంగా ఈమె ప్రభాస్ గురించి ఆయన సినిమాలో నటించే విషయం గురించి ఇలాంటి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభాస్ గురించి రంబా చేసిన ఈ కామెంట్స్ విన్నటువంటి ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube