ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య రాజుకున్న అగ్గి నేటికీ చల్లారలేదు.రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు రహస్య యత్నాలు చేస్తూనే వున్నాయి.
భారత్ మాత్రం తమపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు సాక్ష్యాలు చూపాల్సిందేనని పట్టుబడుతోంది.ఒకానొక దశలో కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
అయితే ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తర్వాత వీసా సేవలను పునరుద్ధరించింది.
నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందంటూ ఇప్పటికే కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్, అమన్‌దీప్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ సిటీలో కెనడా పోలీసులు( Canada Poice ) అరెస్ట్ చేశారు.నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు.ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.
చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.కొద్దిరోజుల క్రితం జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.
భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు.అయితే అది విదేశీ దౌత్యవేత్తలను బెదిరించే స్వేచ్ఛతో సమానం కాదని.
వేర్పాటువాదానికి, హింసను సమర్ధించే అంశాలకు పొలిటికల్ స్పేస్‌ను అనుమతించదన్నారు.
ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలు ఒకే వేదికపైకి రానుననారు.శుక్రవారం ఇటలీలో జరిగే జీ-7 దేశాధినేతల సదస్సులో వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉంది.ప్రపంచంలోనే ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాల శిఖరాగ్ర సదస్సులో ఐదోసారి పాల్గొనేందుకు మోడీ గురువారం ఇటలీ చేరుకోనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియాలోని లగ్జరీ రిసార్ట్ బోర్గో ఎగ్నాజియాలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లు జీ7లో సభ్యదేశాలుగా ఉన్నాయి.భారత్ 11వసారి జీ7 సమ్మిట్‌లో పాల్గొంటుండగా.
ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 5వసారి హాజరుకానున్నారు.